SAKSHITHA NEWS

*కాంగ్రెస్ పాలనలో కరెంటు సక్కగ లేక పారింది పారుతుండే ఎండింది ఎండుతుండే: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని కేరెల్లి, మున్నూరుసోమారం, నాగసముందర్ మరియు ధారూర్ రైతు వేదికలలో నిర్వహించిన రైతుల సమావేశాల్లో పాల్గొన్నారు.
అధికార దాహంతో కల్లబొల్లి మాటలు చెప్తూ… రైతులను ఎద్దేవ చేస్తూ… మాట్లాడిన కాంగ్రెస్ వారికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
గతంలో కరెంటు సక్కగా ఉండక పారింది పారుతుండే ఎండింది ఎండుతుండే, అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలన్నారు.
రైతు క్షేమాన్ని కోరుతూ నకిలీ విత్తనాల ఉత్పత్తులపై ఉక్కు పాదం మోపిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.
గతంలో వేసవికాలం వచ్చిందంటే కరెంటు లేక చెట్ల కింద కాలం గడిపే రోజులు ఉండేవని ఇప్పుడు అలాంటి సందర్భాలు కంటికి కూడా కానరాకుండా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్న ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
రైతులకు కరెంటు ఎంతసేపు అవసరమో కూడా తెలియని అవగాహన లేని వారి గురించి మన ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమాలను ప్రజలు గ్రామాల్లో, వ్యవసాయ పనుల్లో, గుమిగూడినప్పుడు చర్చ పెట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు
.


SAKSHITHA NEWS