యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం ధీలవర్ పూర్ గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యం తో వాటర్ క్యాన్లు పంపిణీ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీర్ల ఐలయ్య కు గ్రామస్థులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఘన స్వాగతం పలికారు.గ్రామంలో పలువురు పలు సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.గ్రామంలో కలయ తిరుగుతూ అందరిని ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు..అనంతరం సమావేశంలో పెద్దఎతున్న కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు.ఆ తర్వాత ప్రజలకు వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.మోట కొండూరు మండలం కేంద్రంగా ఏర్పడినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు అద్దెకు ఉండటం ఈ తొమ్మిది ఏళ్ల అభివృద్ధి కి నిదర్శనమన్నారు. మోటకొండూరు మండలంలో ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయో తెలుపాలన్నారు,అదేవిధంగా ఈ మండల వ్యాప్తంగా ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. ఈ మండలంలో ఉన్న దళిత సోదరులకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో ఆలేరు నియోజకవర్గం లో 170గ్రామాలకు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని అన్నారు.దానితోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వాటర్ క్యాన్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.నియోజకవర్గం లో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా సేవ చేయడానికి నేను ముందున్నానని బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులే గ్రామాల్లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో అభివృద్ధి జరగలేదని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని చెప్పి ఏ గ్రామంలో నిర్మాణం చేయలేదని,తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్త రేషన్ కార్డులు రాలేదన్నారు.ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అప్పటి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని బీర్ల ఐలయ్యఅన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,మండల సీనియర్ నాయకులు,సర్పంచులు,యూత్ నాయకులు,ఎన్ ఎస్ యూ ఐ నాయకులు,గ్రామ శాఖలు,కార్యకర్తలు,ప్రజలు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.