గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..
సాక్షిత : దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని కాలనీ ప్రజలందరు బాధ్యత తీసుకుని వారి ఇండ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటారని, చెత్తను వీధుల్లోనూ కాలువలోను కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు.
పీజేఆర్ నగర్లో దాదాపు తొంభై శాతం అభివృద్ధి పనులు పూర్తైయ్యాయని, కాలనీలోని పెండింగ్ ఉన్న డ్రైనేజీ పనులను మరియు ఫీనిసింగ్ లేకుండా ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యను గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా యువనేత రామకృష్ణ గౌడ్ ఎంటమొలజీ సిబ్బందితో కలిసి వర్షాల కారణంగా కాలనీలో కొన్ని చోట్ల నిల్వ ఉన్న వర్షపు నీటిలో దోమల నివారణ రసాయనాన్ని పిచికారీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్, వెంకట్ నాయక్, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, షకీల్ మున్నా, భిక్షపతి, మధులత, సావిత్రి, నస్రీన్, అప్పలనాయుడు, వెంకట్, కరుణాకర్, శైలేష్, శ్రీనివాస్, సీతారామయ్య, రవి, సాయి, ప్రవీణ్, సుధీర్, మధు, డి.నరసింహులు, శివ తదితరులు పాల్గొన్నారు.