తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట మాట ద్వారా జనాన్ని చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఇటిక్యాల ఎంపిపి స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.
మండలపరిదిలోని ఎర్రవల్లి కూడలిలో సాయిచంద్ కు కన్నీటి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిపి స్నేహాశ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
సాయిచంద్ పద్నాలుగేళ్ళ వయస్సునుండే సామాజికగీతాలు పాడారు.
పాలమూరు కన్నీటిని గానం చేశాడు.సాగుయోగ్యమైన భూములుండి,కృష్ణా, తుంగభద్ర లాంటి రెండు జీవనదులుండి పాలమూరులో ఆకలిచావులు ఎందుకున్నాయని తన పాటలద్వారా పాలకులను ప్రశ్నించాడని స్నేహశ్రీధర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ వెనుకబాటుకు కారణం వలసపాలనే అని గుర్తించాడు.స్వరాష్ట్రంకోసం తన స్వరాన్ని అంకితమిచ్చాడు.ముప్పైమూడు జిల్లాల్లో అలుపెరుగని గానంచేశాడని ఆమె అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణంకోసం శక్తివంచన లేకుండా కృషిచేశారని స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.సాయిచంద్ చిన్నతనంలోనే కన్నుమూయడం బాధాకరమని ఎంపిపి స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.
సాయిచంద్ బౌతకంగా మనకు దూరమైనా తన పాటల రూపంలో తెలంగాణ గడ్డపై సజీవంగా ఉంటాడని స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో అమరులబంధుమిత్రులసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కావలిమణ్యం,షేక్ పల్లి సర్పంచ్ రవీంధర్ రెడ్డి, బీచుపల్లి సర్పంచ్ నర్సమ్మ సుధాకర్ రెడ్డి.జెఏసి నాయకుడు రాగన్న.బిఆర్ఎస్ నాయకులు జి . శ్రీధర్ రెడ్డి,కోటిరెడ్డి,డి.రాములు,శంకర్ నాయుడు.
తెలంగాణ విద్యార్థి విభాగం ఇటిక్యాల మండల అధ్యక్షుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు…