చిట్యాల సాక్షిత ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోగికారి మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా విద్యా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ కార్పొరేట్ స్కూల్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. విద్యార్థులు చదువులో ముందంజలో ఉండాలని పాఠశాలకు ఎల్లవేళలా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పించిందని, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు , మధ్యాహ్న భోజనం తో పాటుగా సాయంత్రం వేళ స్నాక్స్, రాగి జావా అందిస్తున్నామని , అంతేకాకుండా ఉచిత మెడికల్ చెకప్ లు , విద్యార్థులకు విద్యా ప్రగతి కోసం టి.ఎల్.ఎం మేళాలు , సైన్స్ పరికరాల ప్రదర్శన , రీడింగ్ కార్నర్స్ , పాఠశాల లో గ్రంధాలయాల ఏర్పాటు , డిజిటల్ తరగతుల కోసం ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డు సిస్టం ద్వారా విద్యా బోధన లాంటి వినూత్న ప్రయోగాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రగతి జాతీయస్థాయిలో అత్యున్నత అభివృద్ధి పథంలో అగ్రగామి గా నిలిచింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ఎస్ ఎంసి చైర్మన్ గోలి భాస్కర్, నాయకులు జిట్టా చంద్రకాంత్, గ్యార శేఖర్,
ఉపాధ్యాయులు మధుమతి రాధిక రేవతి, పద్మజ, ఇందిర, కవిత, సైదులు, శైలజ, వనజ మంజుల, జూనియర్ అసిస్టెంట్ సత్తయ్య, ఓ ఎస్ కలీల్, విద్యా వాలంటీర్ తిరుమలమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.