ఇందిరాగాంధీ నగర్, సౌభాగ్య నగర్, ఆదర్శ్ నగర్, సుమిత్రా నగర్, గూడెన్ మెట్ లో సాగిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాదయాత్ర…
సాక్షిత కుత్బుల్లాపూర్ నియోజక వర్గం : ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేపట్టిన పాదయాత్ర రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ నగర్, సౌభాగ్య నగర్, ఆదర్శ్ నగర్, సుమిత్రా నగర్ మరియు గూడెన్ మెట్ బస్తీల్లో సాగింది. పాదయాత్ర లో శ్రీశైలం గౌడ్ ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా బస్తీల్లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్రకు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి శ్రీశైలం గౌడ్ కి తమ మద్దతును తెలిపారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, బీజేపీ కి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్తీ లలో కనీసం మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాన్ని రాష్ట్రం అమలు చేయకుండా, కార్పొరేట్ ఆసుపత్రులకు వంతపాడుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే పేదలకు ఉచితంగా వైధ్యం, విద్యను అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏర్వ వెంకట రమణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి జగన్ మోహన్ రావ్, డివిజన్ ఇంఛార్జ్ మోతె శ్రీనివాస్ యాదవ్, ఎపిహెచ్బి కాలనీ అధ్యక్షుడు రామచందర్ రావ్, గూడెన్ మెట్ కాలనీ ప్రెసిడెంట్ చాపల కృష్ణ, సుమిత్ర కాలనీ అడ్వైసర్ బ్రహ్మానందం, ఆయా బస్తీల సీనియర్ నాయకులు చెరుకు లావణ్య, నవాజ్, షాకీర్, గూడెన్ మెట్ అశోక్, మల్లం శ్రీనివాస్ గౌడ్, తోకల శ్రీను, జూల సందీప్, చోటు, కన్హయ్య లాల్, హెమ్ సింగ్, వేణు గోపాల్, శ్రవణ్, సాయినాథ్, శ్రీకాంత్, సిద్దార్థ్, మహేష్, బాగేష్, రాజశేఖర్, రామగిరి రాకేష్, నాగేందర్ రెడ్డి, సాయినోజు శ్రీకాంత్, విజయ్, ప్రవీణ్, రమణయ్య, శ్రీనివాస్, శివ, వెంకటేష్, చెంచు రెడ్డి, సుకన్య, శ్యామల, లక్ష్మి, వరమ్మ, పద్మ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.