చిట్యాల సాక్షిత
పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం అని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ హరితోత్సవాన్ని చిట్యాల పట్టణంలోని రైతు వేదిక వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పాల్గొని రైతు వేదిక పక్కనున్నటువంటి నర్సరీలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరము శివనేని గూడెం 1వ వార్డు లో పురపాలక సంఘం పట్టణ ప్రకృతి వనరులను ఏర్పాటు చేయుటకు కేటాయించిన ప్రభుత్వ భూమి నందు మొక్కలు నాటడం జరిగింది.
అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితోత్సవం ద్వారా చెట్లు నాటి పచ్చదనం పరిశుభ్రతకు నాంది పలికిన ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డి, కౌన్సిలర్స్ కోనేటి కృష్ణ,జిట్టా పద్మ బొందయ్య,బెల్లి సత్తయ్య, కోఆప్షన్ సభ్యులు రుద్రవరం పద్మ యాదయ్య,పిఎసిఎస్ వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు పొన్నం లక్ష్మయ్య, జగిని బిక్షం రెడ్డి,జిట్టా చంద్రకాంత్, సిలివేరు శేఖర్,
గంట్ల శ్రీనివాస్ రెడ్డి, షీలా సత్యనారాయణ, రంగా వెంకన్న,చిత్రగంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు