సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపల్ పరిధి గండిమైసమ్మలోని పురపాలక కార్యాలయంలో దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అధ్యక్షతన వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని చైర్ పర్సన్ క్రిష్ణవేణి క్రిష్ణ ఆవిష్కరించారు. గ్రీన్ ఎర్త్ – క్లీన్ ఎర్త్, సే నో టు ప్లాస్టిక్ మరియు తదితర ప్లే కార్డులతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయ అవరణలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రగతి డాక్యుమెంటరీపై తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. సఫాయి అన్న సలాం అన్న స్లోగన్ తో శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేశారు.
పురపాలక కౌన్సిలర్లను చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ధృవ పత్రాలు, శాలువా మేమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, కుంటి అరుణ నాగరాజు, అమరం గోపాల్, జక్కుల క్రిష్ణ, ఆనంద్ కుమార్, కొల సాయి యాదవ్, మహేందర్ యాదవ్, ఏల్లుగారి సత్యనారాయణ, భారత్ కుమార్, శివనురి నవనీత మల్లేష్, మైసిగారి సుజాత వెంకటేష్, ఎంబరీ లక్ష్మి ఆంజనేయులు, శామీర్ పేట సంధ్య హనుమంత్ రావు, జోస్ఫిన్ సుధాకర్ రెడ్డి, మాదాస్ వెంకటేష్, నాయకులు బుచ్చి రెడ్డి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, పీసరి క్రిష్ణ రెడ్డి, మేనజర్ సునంద, అర్.వో శ్రీహరి, ఏఈ ప్రవీణ్ కుమార్, మునిసిపల్, రెవెన్యూ, మెప్మా సిబ్బంది, స్వయం సహాయక బృందాలు, ఆర్.పి లు, అంగన్వడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు..*