SAKSHITHA NEWS

ముగిసిన స్మార్ట్ కిడ్జ్ సమ్మర్ క్యాంపు.

  • పది అంశాలలో నైపుణ్యాలు పెంచుకున్న విద్యార్థులు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శుక్రవారం ఉత్సాహంగా ముగిసింది. ఈ నెల రోజులపాటు విద్యార్థులకు అబాకస్, కాలిగ్రఫీ, ఇంస్ట్రు మెంటల్ మ్యూజిక్, ఇంగ్లీష్ ఒకాబ్లరీ, డాన్స్, చెస్, డ్రాయింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్, యోగ అంశాలలో విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుతూ శిక్షణ ఇచ్చారు. అనుభవం గల శిక్షకులు విద్యార్థులను అన్ని అంశాలలో ప్రతిభను పెంచారు. శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణచైతన్య విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు ను అందించి అభినందించారు.ఈ సందర్భంగా చింత నిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ విద్యార్థులను పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం చేయకుండా ఆల్ రౌండ్ డేవలప్మెంట్ కోసం అన్ని అంశాలలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడానికి ఈ సమ్మర్ క్యాంపును ఉత్సాహంగా నిర్వహించామని తెలిపారు.విద్యార్థులు సమ్మర్ క్యాంపులో అన్ని అంశాలలో నైపుణ్యాలు పెంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ శుక్రవారం ఆనందోత్సవాలతో ముగిసిందని తెలిపారు.సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సంగీత వాయిద్యాలు, నృత్యాలు అందరిని అలరించాయి.


SAKSHITHA NEWS