SAKSHITHA NEWS

కందుకూరు పట్టణంలో కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సుల్తాన్ మొహిద్దిన్ హాస్పిటల్, ముప్పారోశయ్య హాస్పిటల్, ప్రభుత్వఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల నందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రియం వధ, జిల్లా ప్రోగ్రాం అధికారులు డి ఈ ఎం ఓ బి శ్రీనివాసరావు,డిప్యూటీ డి ఈ ఎం ఓ కే. కనక రత్నంలు కలసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంహెచ్వో డాక్టర్ ప్రియం వద మాట్లాడుతూ సబ్ కలెక్టర్ శోభిక ఆదేశాల మేరకు కందుకూరు పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లను జిల్లా అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించామని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు ప్రోత్సహించినా, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వారి స్కానింగ్ సెంటర్లను కూడా మూసివేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో డాక్టర్ బ్యులా గ్రేస్, ఆరిఫ్ హెచ్ ఈ ఓ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS