SAKSHITHA NEWS

గుర్రంపోడు సాక్షిత

గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో ప్రజల తాగునీటి కోసం వేసిన బోరు మోటర్ ను ఎంపీపీ మంచి వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ చేపూరు గ్రామంలో గత 15 ఏళ్ల క్రితం గ్రామ ప్రజల ఇళ్లస్థలాల కోసం అప్పటి ప్రభుత్వం ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినదని ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని ఆ యొక్క స్థలంలో పేద ప్రజల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వవలసిందిగా ఎంపీపీ ని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆ యొక్క స్థలం గురించి శాసన సభ్యులు నోముల భగత్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి,ఎంపీటీసీ వలిశెట్టి మధు,తెరాటే గూడెం సర్పంచ్ జక్కల భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షులు సంకటిగిరి బాబు,మాజీ సర్పంచ్ కొమ్ము రామలింగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ నడ్డి శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్,మండల సీనియర్ నాయకులు భాషాపాక యాదయ్య,వార్డు నెంబర్లు ముష్టిపల్లి శ్రీను,మారపాక మహేందర్,నిరసనమెట్ట దుర్గయ్య,కురుమేటి శ్రీను,నిరసన మెట్ల లింగయ్య, సంకటి నరసింహ,సంకటి మహేష్, నిరసనమెట్ల రాజు,కొండలు,కుందూరు శ్రీకాంత్ నిరసన మెట్ల వెంకటేశ్వర్లు,రమేష్,కొమ్ము సుధాకర్ ,ఇందిరమ్మ, శంకర్,సౌజన్య ,తదితరులు,పాల్గొన్నారు.


SAKSHITHA NEWS