గ్రామాల అభివృద్దే ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి
— నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
— తాళ్ల వెల్లం గ్రామంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
చిట్యాల సాక్షిత ప్రతినిధి
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అన్నారు.చిట్యాల మండలంలోని తాళ్ళవెళ్లెంల గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని సిసి రోడ్లు డ్రైనేజీ వైకుంఠధామం, ప్రకృతి వనం లతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, తాళ్ల వెల్లంల మాజీ సర్పంచ్ జనగాం నరసింహ, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కొలను వెంకటేష్ గౌడ్, సుంకరి యాదగిరి గౌడ్
వార్డు సభ్యులు శిరీష లింగస్వామి, వివిధ హోదాలలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.