మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి జైలు శిక్ష – యస్.పి
— ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా
నల్లగొండ సాక్షిత
మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి నిడ్మనూర్ జె ఎఫ్ సిఎమ్ కోర్టు ఒక సంవత్సరం జైలు మరియు 1000 రూ జరిమానా విధించినట్లు జిల్లా యస్.పి అపూర్వ రావు తెలిపారు. వివరాలలోకి వెళితే 12మార్చి 2017 నాడు చలకుర్తి గ్రామానికి చెందిన ఒక మహిళా సాయంత్రం హాలియా నుండి చలకుర్తి వెళ్ళే క్రమంలో ఆటో డ్రైవర్ అయిన నిందితుడు మల్లేపల్లి నాగేంద్ర అలియాస్ నాగరాజు గ్రామం చలకుర్తి, పెద్దవూర మండలం మార్గ మధ్యలో మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించాడని పెద్దవూర పోలీస్ స్టేషన్ లో మార్చి 15, 2017 రోజున బాధిత మహిళా నిందితుడు నాగేంద్ర పైన ఇచ్చిన పిర్యాదు మేరకు పెద్దవూర పోలీస్ స్టేషన్ లో క్రైం నం. 47/2017, సీసీ నం. 897/2017 ఆ/సెక్షన్ 354 , 504, 506 R/w 34 ఐపీసి కింద కేసు నమోదు చేయగా పూర్తి స్థాయి విచారణ అనంతరం నేడు నిడ్మనూరు జెఎఫ్సిఎం కోర్టు,మేజిస్ట్రేట్ స్వప్న నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు 1000రూ జరిమానా తీర్పును విధించినట్లు జిల్లా యస్.పి తెలిపారు.ఈ సందర్భంగా సరైన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కె.శ్రీనివాస్ ప్రస్తుత యస్.ఐ పి.పరమేష్, ఎపిపీ సాధన కోర్టు డ్యూటీ ఆఫీసర్ రవి కుమార్, లైజెనింగ్ ఆఫీసర్ ఎస్కే. అలీ హమ్మద్ ని యస్.పి అబినందించారు.