జీపీఎస్ ల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు
రామన్నపేట సాక్షిత
రామన్నపేట మండలం ఎంపిడిఓ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయత్ సెక్రటరీలు శాంతి యుతంగా చేస్తున్న సమ్మె కు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి,జూనియర్ పంచాయతీ కార్యదర్శిలతో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల పని గ్రామంల్లో అభినందనీయమని, వారి వల్ల దేశ స్థాయి అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పలు గ్రామాలు ఎంపిక అవ్వడం కార్యదర్శుల పని విధానానికి నిదర్శనం అన్నారు. పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరు అని 3సంవత్సరాలు ప్రొబెషన్ పీరియడ్ అని చెప్పి 4సంవత్సరాలు అవుతున్న కనీసం వాళ్లను రెగ్యులర్ చేయకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నటి కేసిఆర్ ప్రభుత్వం వెంటనే పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలోనే పంచాయతీ సెక్రెటరీలకు మద్దతు తెలిపారని ప్రతి ఒక్క ఉద్యోగి తరపున ప్రజల తరపున కొట్లాడేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అన్నారు.వారికి న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధక్షులు గుని రాజు,సామజిక కార్యకర్త వేముల సైదులు, బిఎస్పి నాయకులు మంటి నరేష్, పంచాయతి కార్యదర్శుల జిల్లా బాద్యులు స్వరూప, రసూల్, రమేష్, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ శిరీష,కోశాధికారి అయ్యప్ప రెడ్డి, మీడియా కన్వీనర్లు వేణు,పవన్ కుమార్, నరేష్, ఉపేందర్, రమాదేవి, మహేష్, పావని, లావణ్య, ఉమా శంకర్, వెంకటేష్, విఠల్,సుధ బిఎస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.