నాగార్జునసాగర్ – సాక్షిత
నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియా లోని క్యాంప్ కార్యాలయంలో
నియోజకవర్గం గుర్రంపోడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన
7 లక్షల 33వేల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ
ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి మేలు జరిగిందన్నారు.
చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారందరికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేసి అండగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో పాలకులు ఏ రోజు కూడా తెలంగాణ పేదల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు,మంచి కంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ ధనంజయ,అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్, ఎంపిటిసి చంద్రమౌళి, సర్పంచులు చాడ చక్రవర్తి, రామచంద్రం, యాదగిరి రెడ్డి, పద్మా వెంకటేశ్వర్లు, మండల నాయకులు వాకిటి చక్రవర్తి, భాష పాక యాదయ్య, పుట్టపాక వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.