SAKSHITHA NEWS

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

నకిరేకల్ పట్టణంలో రూ.26 కోట్లతో సాగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజి పనులను మంగళవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల దృష్ట్యా రోడ్డు మధ్యలో నుంచి
50 ఫీట్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు రోడ్లపైకి ఉన్న నిర్మాణాలు, దుకాణాలు ఇళ్ల స్లాబుల ముందు భాగాలు తొలగింపు ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలన్నారు. నకిరేకల్ పురపాలికలో జరుగుతున్న అభివృద్ధి పనులకు స్థానికులు, వ్యాపారస్తులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS