SAKSHITHA NEWS

దేశానికి డిక్చూచి తెలంగాణ

కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు

దేశంలో గుణాత్మకమైన మార్పు అనివార్యం

కేసీఆర్ పాలనకు బ్రహ్మ రథం

50 వేల నీరు సముద్రం పాలు

తమాషా చూస్తున్న దేశ పాలకులు

దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేయాలి

పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణా భవన్ లో గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంతకముందు సీఎం కేసీఆర్ తో కలసి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో కూడా నామ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ దేశానికి బీఆర్ఎస్ పార్టీనే దిశ దశ అవుతుందని పేర్కొన్నారు. స్వరాష్ట్ర తెలంగాణా పాలనలో తొమ్మిదేళ్లలో అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించి, దేశానికే డిక్చూచి గా మారమని అన్నారు.రైతు బంధు, రైతు భీమ, ఉచిత విద్యుత్, దళిత బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,ఆసరా పెన్షన్లు వంటి ఎన్నో ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణా ఖ్యాతి దేశం నలుమూలల వ్యాపించిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధిని గుర్తించిన దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ,దేశంలో సమూల మార్పు కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగ మిస్తుందన్నారు. వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశంలో ప్రతి ఎకరాకు సాగునీటినందించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని అన్నారు.50 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నా దేశ పాలకులు తమాషా చూస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అమలు చేసే విధంగా నూతన విద్యుత్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీర్మానించిందని నామ నాగేశ్వరరావు తెలిపారు..


SAKSHITHA NEWS