సాక్షిత : * కొంపల్లి పురపాలక సంఘంలో పనిచేసే పారిశుధ్య కార్మికులు సివిల్ డ్రెస్ లో ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి రావాలని చైర్మన్, కమిషనర్ ఆదేశాల మేరకు పెట్టిన సందేశంపై విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొంపల్లి పురపాలక కౌన్సిలర్ల తో కలిసి ప్రజావాణి లో జిల్లా రెవెన్యూ అధికారికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పిర్యాదు చేసారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులకు తెలిసే విధంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జయశంకర్ గౌడ్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా, బీజేపీ నేతలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడితే ఊరుకోమని అన్నారు.జిల్లా కలెక్టర్ విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో ఈ విషయమై బీసీ కమిషన్, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి పురపాలక కౌన్సిలర్ రాజిరెడ్డి, కొంపల్లి బీజేపీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్, మరియు పలువురు బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.