డు యువర్ డ్యూటీ… డోంట్ డు పాలిటిక్స్ :- మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్..!!
వికారాబాద్:-
వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మహిళా ప్రజా ప్రతినిధులకు ఘోర అవమానం జరిగింది.దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ మరియు ఎంపిపి,కౌన్సిలర్ ల ప్రోటోకాల్ అధికారులు మరిచి కేవలం స్థానిక ఎమ్మెల్యే పోటో మాత్రమే వేయడంతో మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ మరియు ఎంపీపీ చంద్రకళ ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు వారి విధులను మరచి రాజకీయం చేయడం ఏమిటో అంతు చిక్కడం లేదని, ఇంత జరిగినప్పటికీ పేద ముస్లిం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దుస్తుల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగాలనే ఒకే ఒక ఉద్దేశంతో వేదికను అలంకరించడం జరిగిందని తెలియపరిచారు. మీ డ్యూటీ మీరు చేయండి దయచేసి రాజకీయాల్లో తల దూర్చొద్దు అని అధికారులకు మున్సిపల్ చైర్మన్ విన్నవించారు.
ఇదిలా ఉంటే దుస్తుల పంపిణీ కార్యక్రమం 10:30 సమయానికి ఏర్పాటు చేసి 12 గంటలకు కార్యక్రమం కొనసాగడంతో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రోజా లో ఉన్న ముస్లిం సోదరులు మహిళలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఇదే వేదికపై వికారాబాద్ ఎమ్మార్వో వ్యవహార శైలిపై ఇటు ప్రజలు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.