SAKSHITHA NEWS

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బిఎస్పి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో వున్న అంబేడ్కర్ విగ్రహానికి
బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి
పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందించడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని అందించారని అన్నారు. దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ కొనియాడారు. బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది, మానవతా వాది అని పేర్కొన్నారు. లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు.

ఆర్థిక శాస్త్రంలో మొదటి పి హెచ్ డి చేసిన వ్యక్తి డా బి ఆర్ అంబేద్కర్ రే నని చెప్పారు. అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త డా బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపకల్పన లో కీలకమైన ముసాయిదా కమిటీ కి చైర్మన్ గా వ్యవహరించారనీ చెప్పారు. దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము ను రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని కొనియాడారు.బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందన్నారు.

మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి దళితులపై మహిళలపై దాడులకు ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దేశ సంపదను అంబానీలకు ఆదోనిలకు కట్టుబడుతుందన్నారు. లౌకిక వాదానికి దెబ్బ కొడుతుందని రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మికులకు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరంహొ ఎంతైనా ఉందన్నారు. ఆ రకమైన దఅక్పథంతో యువత ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కార్యదర్శి చందుపట్ల శృతి,నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, నియోజకవర్గ బి వి ఎఫ్ కన్వీనర్ మేడి రఘు, మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మండల ఉపాధక్షులు చింత శ్రీకాంత్,మండల కార్యదర్శి చింత రవి,మల్లేష్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS