భౌరంపేట్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు…

Spread the love

సాక్షిత : * అణగారిన వర్గాల ఆత్మాభిమాన పతాక డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని అంబేడ్కర్ విగ్రహానికి మున్సిపల్ కౌన్సిలర్లు మరియు BRS పార్టీ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైన గమ్యాన్ని చేరుకోగలమనే తాత్వికతకు అంబేడ్కర్ జీవితం నిదర్శనం అన్నారు. దళిత సమాజ శ్రేయస్సు కొరకు తోడ్పడిన అంబేడ్కర్ కి CM కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారన్నారు. నిజమైన దళిత సమాజ అభివృద్ధి ప్రదాత మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , భౌరంపేట్ PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , BRS పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి , బుచ్చిరెడ్డి , సురేందర్ రెడ్డి , కొమ్ము జీవన్ , బైండ్ల గోపాల్ , కామేశ్వరరావు , గోపాల్ , శ్యామ్ మరియు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page