ప్రకాశం జిల్లా
పెద్ద దోర్నాల్లోని స్థానిక నటరాజ్ కూడలిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు పెద్ద దోర్నాల మండల కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి నటరాజు కూడలి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక ఆధ్వర్యంలో పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని 1891 ఏప్రిల్ 14వ తేదీన మన ఆణిముత్యం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మించారని తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే దిశగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమానత్వం కోసం లింగ వర్ణ, భేదాలు లేకుండా భారత రాజ్యాంగాన్ని రచించి ఆ ఫలాలను మనము అనుభవించేందుకు బంగారు బాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మోహన్ రావు, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ గంట వెంకటరమణారెడ్డి, ఆలూరి జయ సంపత్, పెద్ద దోర్నాల సబ్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, గుమ్మ ఎల్లేష్, సంఘటి సుధాకర్ రావు, వైయస్సార్ కేపీ ఎపిఎం దర్శనం పోలయ్య, మొహంతోనాయక్, గిరిజన నాయకులు, మంతన్న, పోతన్న, చిట్యాల యోగి రెడ్డి, తంగిరాల శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.