SAKSHITHA NEWS

నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన – బిజెపి.

— బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

— కేంద్ర ప్రభుత్వ పథకాల గూర్చి ప్రజలకు వివరణ

— పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజేపి ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు పాల్గొని మాట్లాడుతూ పల్లె పల్లెకు ఓబీసీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు గురించి తెలియజేయడం జరిగిందన్నారు.

వెంబావి గ్రామంలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీసీలకు ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి పొందిన ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారని తెలియజేస్తూ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 102 వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కి రాజ్యాంగ హోదాను అందిస్తుందన్నారు, 105వ రాజ్యాంగ సవరణ చట్టం, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాను రూపొందించే హక్కు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అని తెలియజేశారు, ఓ బి సి ఆదాయ క్రిమిలేయర్ సవరణ 2017లో ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయాన్ని రూపాయలు ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో బీసీలను 9 ఏళ్లలో అన్ని రంగాల్లో అణచివేసిందని అన్నారు. రాజకీయంగా, ఆర్థికపరంగా, విద్యాపరంగా, సామాజిక న్యాయం పరంగా, ఉద్యోగ, ఉపాధి పరంగా, ఇలా అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్న బీసీ సామాజిక వర్గం ఒక్కసారి ఆలోచన చేయాలని కేసిఆర్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ గరిషే రవికాంత్, ఓబిసి చిట్యాల మండల కోఆర్డినేటర్ గుండెబోయిన నరసింహ, బూత్ కమిటీ అధ్యక్షులు సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, గురిజే వెంకన్న, లింగస్వామి, మల్లేష్, రమేష్, లింగయ్య, నరసింహ, వెంకన్న, అద్దెల కృష్ణారెడ్డి, మహేష్ , పవన్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS