SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

చిట్టచివరి గ్రామమైన రోల్లపెంట గిరిజన గూడెం లో యర్రగొండపాలెం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్ పర్యటించారు. గూడెంలో నివాసం ఉంటున్న గిరిజనలు మౌలిక స్థితిగతులు మరియు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయగా, కేవలం మా ఓట్ల కోసమే ఐదేళ్లకోసారి మా గూడెంలో అధికారులు వచ్చి వెళ్తుంటారని మమ్మల్ని పట్టించుకునే వారే కరువయ్యారని గౌతమ్ ముందు వాపోయారు.

గిరిజన పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న గౌతమ్, రాబోయే జనసేన పార్టీ ప్రభుత్వం లో రోళ్లపెంట గిరిజన గూడెంలో పక్క ఇల్లు నిర్మిస్తామని, గూడెంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని గిరిజన మహిళలకు హామీ ఇచ్చారు.
అనంతరం అక్కడ నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కేతి వెంకట మోహన్ మురళి, కోసన ప్రసాదుజన సైనికులు గుర్రాల ప్రసాద్, చల్ల మధుసూదన్ రెడ్డి, చంద్ర ,బాల కుమార్, విష్ణు, అంజి నాయుడు, అజయ్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS