SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

రాయితీ పై కిసాన్ డ్రోన్ల ఏర్పాటు కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తుల ఆహ్వానం:
త్రిపురాంతకం మండలంలో అర్హులైన నిరుద్యోగ యువత నుండి కిసాన్ డ్రోన్లు ఏర్పాటు చేసుకుని లబ్ది పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి అని త్రిపురాంతకం మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కే నీరజ మండల్ రైతులకు సూచించారు. కిసాన్ డ్రోన్లు తీసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వ్యవసాయ డిప్లొమా లేదా వ్యవసాయ కోర్సులో డిగ్రీ లేదా ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. మరియు పాస్పోర్ట్ కలిగి ఉండాలి.

ముఖ్యముగా వారు రైతు కుటుంబమునకు చెందిన వారై ఉండాలి. పైన తెలిపిన అర్హతలు ఉన్న నిరుద్యోగ యువతకు వ్యవసాయ శాఖ ద్వారా . పైలట్ శిక్షణ ఇప్పించి తద్వారా వారి గ్రామ పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 40 నుండి 50 శాతం రాయితీ తో కిసాన్ డ్రోన్లు ఇవ్వబడతాయి.ఈ అవకాశాన్ని త్రిపురాంతకం మండల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పూర్తి వివరములకు మీ యొక్క రైతు భరోసా కేంద్రములో సంప్రదించగలరు.


SAKSHITHA NEWS