ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

Spread the love

కీ”శే”మంగునూరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు ..
ఉచిత వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
నందిగామ మండలంలోని పెద్దవరం గ్రామంలో సచివాలయం వద్ద కీ”శే” మంగునూరు కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు ..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయని చెప్పారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు ప్రపంచాన్ని చూసే మన కళ్ళను పదిలంగా ఉంచుకోవడానికి -కళ్ళు అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరునికి అందుబాటులో ఉండాలని, పౌరులందరికీ ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను అందించడం కోసం, ప్రభుత్వం అనేక ఆరోగ్య పథకాలు మరియు కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు,

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఉచితంగా కళ్ళ అద్దాలు ఇవ్వటం -కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు, స్వచ్ఛంద సంస్థల నిర్వహించిన వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, నాయకులు కొండా కృష్ణారెడ్డి, టౌన్ కన్వీనర్ దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల కన్వీనర్ మంచాల చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ బాణావత్ దేవిలి, ఎంపీటీసీ సింగంశెట్టి నాగేశ్వరరావు, నెలకుదిటి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page