జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఆవరణలో కృత్రిమ అవయవాల క్యాంపు

Spread the love

ప్రకాశం జిల్లా

మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు

Ysrcp దివ్యాంగుల విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అధ్యక్షతన స్థానిక పూల సుబ్బయ్య కాలనీ నందు గల Ysrcp కార్యాలయం లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

VIRCHOW FOUNDATION వారి ఆర్థిక సహాయంతో శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ టెక్నీషియన్స్ తో ఈ నెల 5వ తారీఖున మార్కాపురం టౌన్ నందు గల జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఆవరణలో కృత్రిమ అవయవాల క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా యాక్సిడెంట్ లో కాళ్లు లేక చేతులు కోల్పోయిన వారికి జైపూర్ ( ఆర్టిఫిషియల్ లింబ్స్ ) పోలియో వాళ్లకు క్యాలీఫర్లకు మెజర్మెంట్ లు తీసుకొనబడును. తర్వాత మళ్లీ క్యాంపు నిర్వహించి అర్హులైన దివ్యాంగులందరికీ ఉచితంగా పంపిణీ చేయబడును. దివ్యాంగులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దివ్యాంగులు ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు వైకల్యం తో ఉన్న 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని రావలెను.

దూరప్రాంతాల నుంచి వస్తున్న దివ్యాంగులకు ఇబ్బంది కలగకూడదు అనే మంచి ఉద్దేశంతో యువ నాయకుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి మధ్యాహ్నం భోజనాలను మరియు మంచి నీటి సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా అధ్యక్షులు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి, blind అసోసియేషన్ నాయకుడు బోయపాటి రామయ్య, మార్కాపురం టౌన్ మరియు రూరల్ అధ్యక్షులు నడికట్టు రమణారెడ్డి మరియు లుంజల శేఖర్, టౌన్ ఉపాధ్యక్షులు సయ్యద్ రహమాన్, టౌన్ కార్యదర్శి విడుదల అశోక్, టౌన్ కోశాధికారి చముడురి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page