సాక్షిత : ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ ఆధ్వర్యంలో..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామమునకు చెందిన యడ్ల సత్యవేణి అనే మహిళ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకోగా ప్రమాదవశాత్తు ఆమె మెడలో మూడు కాసుల బంగారపు పుస్తుల తాడు ఆలయ ప్రాంగణంలో పడిపోగా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన (ఆలమూరు హనుమాన్ టీ స్టాల్ చల్లా సతీష్) సోదరి అయిన సింగులూరీ మల్లేశ్వరికి దొరకడంతో ఆమె నిజాయితీగా స్థానిక ఎస్సై ఎస్ శివప్రసాద్ కి అప్పగించగా సదరు బాధితురాలిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బంగారు వస్తువును ఆమెకు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై శివప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి నిజాయితీగల మహిళ బంగారపు వస్తువును అప్పగించడం చాలా ఆనందకరమని ఆమెను అభినందించి దృశ్యాలువ కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలోపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పడిపోయిన మూడు కాసుల బంగారపు వస్తువు అందజేసిన మహిళకు ఘన సన్మానం.
Related Posts
నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
SAKSHITHA NEWS నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ శివారు సూరాయపాలెంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి గుడివద్ద నాభిశిల (బొడ్డురాయి) ప్రతిష్ట మహోత్సవం…
రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం
SAKSHITHA NEWS కృష్ణాజిల్లా గుడివాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం ట్రాఫిక్ రద్దీపై చర్యలు చేపట్టిన:- ట్రాఫిక్ ఎస్ఐ జీ వి ప్రసాదరావు గుడివాడ పట్టణం కే.టి.ఆర్ కాలేజ్ గేట్ వద్ద ట్రైన్ వెళ్లే సమయంలో గేట్ కి…