SAKSHITHA NEWS

పత్రికా ప్రకటన

◆తిరుమల పవిత్రను బ్రష్టు పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం
◆రాష్ట్రాన్ని గంజాయాంధ్రప్రదేశ్ గా మార్చారు.
◆మద్యపాన నిషేధం, జాబ్ కేలండర్, సి పి ఎస్ రద్దు, పెన్షన్ లపై మడమ తిప్పిన జగన్.
◆అవినీతి లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారు.
◆ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైనా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు.
◆అబద్దాలు చెప్పడంలో వైసీపీ నేతలు ఆరితేరారు.
◆వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నూకసాని

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండపై డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, తిరుమల పవిత్రను బ్రష్టు పట్టిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియా కు అడ్డాగా మారిందని, దేశంలో 7.5 లక్షల కిలోల గంజాయి పట్టుబడితే ఒక్క ఆంధ్ర లోనే 26% శాతం గంజాయి పట్టు బడటం వైసీపీ నేతల అవినీతి కి పరాకాష్ట అని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలకు మోస పూరిత హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం సీసా ముట్టుకుంటే షాక్ కొట్టి అది తాగిన వ్యక్తి అనారోగ్యం బారిన పడుతున్నారని వారి కుటుంబాల వారు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసారని విమర్శించారు. రాష్ట్రంలో 28, లక్షల పేదలకు ఇళ్ల స్థలాలు అని ఇప్పటి వరకూ కనీసం 35% శాతం ప్రజలకు ఇవ్వలేదని విమర్శించారు. ఇళ్ల స్థలాలు కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, ఈ అవినీతి లో ముఖ్యమంత్రి స్థాయి నుంచి వైసీపీ నేతలు అందరికీ భాగస్వామ్యం ఉందని నూకసాని ఆరోపించారు. రాష్ట్రలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాద్యత కలిగిన చదువుతున్న ప్రతి ఒక్కరూ ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని నూకసాని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని నూకసాని విమర్శించారు.

టీడీపీ మాకు ఆఫర్ ఇచ్చిందంటే మాకు ఆఫర్ ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలు ఎగబడి మరీ ప్రకటనలు ఇస్తున్నారని, జగన్ ప్రాపపకం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు అబద్దాలు అడడంలో ఆరితేరి పోయారని నూకసాని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల లో వైసీపీ ఓటమి తర్వాత రాష్ట్ర ప్రజల్లో నూతన ఉత్సాహం పెరిగి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ రాక్షస పాలనకు ఎప్పుడు చరమ గీతం పాడదామా అని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని నూకసాని అన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కి తీసుకొని రావాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నూకసాని స్పష్టం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎలాగైనా ఆపాలని ప్రయత్నించి వైసీపీ నాయకులు విఫలం అయ్యారని నూకసాని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర కు యువత, సామాన్య మద్య తరగతి ప్రజల నుండి కూడా మరింత ఆదరణ లభిస్తోందని నూకసాని బాలాజీ అన్నారు.


SAKSHITHA NEWS