SAKSHITHA NEWS

జీవో నంబర్ 52 ను వెంటనే రద్దు చేయాలి బాపట్ల జిల్లా యానాది సంక్షేమ సంఘం

బాపట్ల పట్టణం ప్రధాన కూడలి లో అంబేడ్కర్ విగ్రహం దగ్గర వివిద గ్రామాల నుండి పెద్ద సంఖ్య లో యానాదులు పాల్గోని మహ ధర్నా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రo లో జీవో నెంబర్ 52 ను వెంటనే రద్దు చెయాలి అని బోయ,వాల్మీకి,బెంతు, ఒరియాల, కులాలను గిరిజనుల కులాల జాబితాలో చేర్చితే సహించేది లేదు అని బోయలను యస్టీల (ST) జాబితాలో చేర్చాలని అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడమైనది. బోయలను ST జాబితాలో చేర్చడమంటే గిరిజనుల గొంతు కోయడమే అని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పేర్కొనడం జరిగింది.రాష్ట్రం లో 40 లక్షల జనాభా ఉన్న బోయలను 32 లక్షల జనాభా ఉన్న గిరిజన జాబితాలో చేర్చడం ఎమిటని యానాది సంఘం నాయకులు ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు లేని అన్ని విధాలా అభివృద్ది చెందిన బోయలను ST జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించు కోకపోతే గిరిజనుల ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు.ఈ 52 వ జివో నిలుపుదల చేయక పోతే వచ్చే మే నెలలో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టినారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా యానాది సంక్షేమ సంఘం అధ్యక్షులు చౌటూరి రమేష్, ప్రధాన కార్యదర్శి తుపాకుల అనిల్, కోశాధికారి బొజ్జ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తలపల సాంబయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయంపు కమల, తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.


SAKSHITHA NEWS