SAKSHITHA NEWS

నెల్లూరు, మార్చి 29 : రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ కరికాల వల్లవన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక, కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి గారి తో కలిసి రామాయపట్నం పోర్టు, తెట్టు వద్ద నిర్మించనున్న విమానాశ్రయం అభివృద్ధి పనులు, పునరావాస చర్యల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా
పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ కరికాల వల కరికాల వల్లవన్ మాట్లాడుతూ రామయపట్నం పోర్టు కు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస కార్యక్రమాలను వేగంగా పూర్తిచేయాలని, అలాగే అటవీ భూములను త్వరగా అన్ని అనుమతులు పూర్తిచేసి పోర్టు వారికి అందించాలని అధికారులను ఆదేశించారు. తెట్టు వద్ద నిర్మించనున్న విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణపై చర్చించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి ఎ. చంద్రశేఖర్, ఏపీఐఐసీ జెడ్ఎం చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం మారుతి ప్రసాద్, సోమశిల ప్రాజెక్టు ఎస్ ఇ వెంకటరమణారెడ్డి, కావలి ఆర్డిఓ శీనా నాయక్, రామాయపట్నం పోర్టు అభివృద్ధి సంస్థ ఎండి పి ప్రతాప్, జిఎం నరసింహారావు, ఓ ఎస్ డి ఐవీ రెడ్డి, ఏపీఏడిఏ సీఈవో నీరజ్, కందుకూరు తాసిల్దార్ సీతారామయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS