బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ ఇల్లు అని నవరత్నాలు పాదయాత్రలో చెప్పి అధికారంలోకి వచ్చారు.
బాపట్ల జగనన్న కాలనీలలో వారి కి సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టమన్నారు.
ఇల్లు కట్టటానికి కనీసం 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరికే పరిస్థితి లేదు.
కార్పొరేట్ సంస్థలకు రియల్టర్లకు, వెంచర్ల వేసేవారికైతే ఇసుక ఎక్కడ నుండి దొరుకుతుంది.
జగనన్న కాలనీలో అధికారుల ఒత్తిడితో కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు, కొంతమంది ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేక ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు.
అటువంటి వారి కైనా ప్రభుత్వం ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీలు కూడా లేవు వెంటనే సంబంధిత అధికారులు జగనన్న కాలనీలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం…