SAKSHITHA NEWS

TSPSC ప్రశ్నా పత్రం లీకేజ్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజి సంఘటనకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు గండిమైసమ్మ చౌరస్తా లో బీజేపీ నిరసన దీక్ష.
ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
తొమ్మిదేళ్లలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారు.. వాటిని కోర్టుల్లో వేయించి లిటిగేషన్లు పెట్టారు.
నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణాను సుక్క, ముక్క తెలంగాణ గా మార్చారు.
ఏళ్లకు ఏళ్లుగా హాస్టల్ లలో, రూమ్ లలో ఉంటూ, ఒక పూట తిని, ఒక పూట తినక కోచింగ్ లు తీసుకుంటున్న నిరుద్యోగుల జీవితాల ఆశల్లో నీళ్లు పోసారు.


గ్రూప్ – 1 లో క్వాలిఫై అయిన ఇరవై ఐదు వేల మంది పరిస్థితి ఏంటి?
ముప్పై లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. వారి తల్లిదండ్రుల ఉసురు మీకు తగులుద్ది.
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు గాలిలో పెట్టిన దీపం లెక్క తయారయినయ్.
ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నా పత్రం లీకేజి ఘటన పై స్పందించాలి.
రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ వారికి అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తుంది… హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.
ప్రశ్నా పత్రం లీకేజ్ ఘటన పై నైతిక భాద్యత వహించి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను.


SAKSHITHA NEWS