SAKSHITHA NEWS

సాక్షిత : అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని PJR ఫంక్షన్ హాల్ లో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి పాల్గొని మహిళ సోదరిమణులను సన్మానించి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సంధర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని, మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, మహిళ సోదరీమణులందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని మహిళ లు వంటింటికె పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకొని అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని,ఆర్థిక స్వాలంబన పొందాలని,పురుషులతో సమానంగా పోటీ పడలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ‘స్త్రీ’ లేకపోతే జననం లేదు!
‘స్త్రీ’ లేకపోతే గమనం లేదు!
‘ స్త్రీ’ లేకపోతే సృష్టిలో జీవం లేదు!
‘స్త్రీ ‘లేకపోతే అసలు సృష్టి లేదు!
సమాజాన్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీ’ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అదేవిధంగా
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె అండగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహిళా బంధుగా నిలిచారు అని, మహిళ పక్షపాతి అని, మహిళలు అన్ని రంగాలలో నిలవాలని, మహిళ సాధికారికత సాదించాలని, మహిళ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు అని, తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళ దినోత్సవ సంబరాలను అంబరాలు తాకేలా ఘనంగా చేయాలని,
10 లక్షలకు పైగా పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వం బీఆర్ ఎస్ ప్రభుత్వం అని, సుమారు 11 లక్షల మందికి పైగా కెసిఆర్ కిట్ లబ్ధిదారుల మైలురాయిని చేరుకుంది అని అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టింది,ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో దేశం ఎరుగని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కెసిఆర్ విజయవంతంగా పూర్తిచేశారు,మాతా శిశు సంరక్షణ కోసం కెసిఆర్ కిట్టు పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రసవానికి ముందు,ప్రసవం సమయంలో, ప్రసవం తర్వాత అవసరమైన అన్ని రక్షణ కార్యక్రమాలను ఇందులో చేస్తున్నాం…మహిళా సంక్షేమం కోసం ఇంత నిబద్ధతతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం మనది, కెసిఆర్ కిట్ ద్వారా మాతా శిశు మరణాలు తగ్గాయి… ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయి,మన ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నది.వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నది.మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది,విద్యాశాఖ లోనూ అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టాము…ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నాము.
70 లక్షలకు పైగా హెల్త్ మరియు hygienic కిట్లను విద్యార్థులకు అందించాము
రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ అనేక కార్యక్రమాలను చేపట్టాము
అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి , బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, మోజేశ్, చంద్రమోహన్ సాగర్,విద్య సాగర్, రాము, శివ సాగర్, సంపత్, శ్రావణి రెడ్డి, స్వరూప, విజయ, రాధాబాయి, భారతమ్మ, కమలమ్మ, నరసమ్మ, లక్ష్మి, కవిత, లక్ష్మి, సరితా బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS