వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి”
సాక్షిత వెలగపూడి:*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో తొలిసారిగా 41,436 కోట్ల, 29 లక్షల రూపాయలతో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .
తన బడ్జెట్ ప్రసంగం ముగింపులో “రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు కల్పించి, అసెంబ్లీలో తొలిసారి వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను” అని పేర్కొన్న మంత్రి కాకాణి.