నిబంధనల ప్రకారం గృహ నిర్మాణం చేయాలి : పుర ఛైర్మెన్ ఎడ్మ సత్యం
పట్టణంలో జరుగుతున్న నూతన గృహ నిర్మాణాలపై భవన నిర్మాణ కార్మికులకు, బిల్డర్లకు మరియు ఎల్టీపిలకు బుధవారం పుర చైర్మన్ ఎడ్మ సత్యం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుర చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 మరియు టి. ఎస్. బీపాస్ 2020 చట్టం ప్రకారం అనుమతి పొందిన తరువాత నిబంధనలకు అనుగుణంగా నూతనంగా నిర్మాణం చేయాలని కోరారు నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు
అలాగే నిర్మాణానికి అవసరమైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా మీయొక్క స్థలంలో వేసుకోవాలని తెలిపారు, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అతి సులువుగా ఉండే విధంగా అక్రమాలకు తావులేకుండా చాలా అద్భుతమైన ప్రణాళికలు రూపొందించరాని కావున ప్రజలు కూడా చట్టంపై అవగాహన తెచ్చుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆశ్రిత్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి విజయ్ కుమార్, కౌన్సిలర్ సైదులు గౌడ్, ఎల్టీపిలు మనోహర్ రావు, సురేందర్, మహమూద్ అలీ భవన నిర్మాణ కార్మికులు శ్రీనివాసులు, రాజు, జంగయ్య, ఉపేందర్, మల్లికార్జున మరియు బిల్డర్లు, పుర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.