SAKSHITHA NEWS

ఉచిత టైలరింగ్ కోర్సు ను పూర్తి చేసుకొన్న మహిళ మూర్తులకు సర్టిఫికెట్స్ ప్రధానం .

ముఖ్య అతిథులు ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ రావి శశికళ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివనాగుల శ్రీనివాస్.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ డైరెక్టర్ వాసుదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా 45 రోజులు కుట్టు మిషన్ శిక్షణా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ రావి శశికళ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివనాగుల శ్రీనివాస్ లు పాల్గొని ఉచిత టైలరింగ్ కోర్సు ను పూర్తి చేసుకొన్న మహిళ మూర్తులకు సర్టిఫికెట్స్ అందజేసి మాట్లాడారు .

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని వారి కళ్ళపై వారు ఆర్థికంగా నిలబడాలని ,నేటి మహిళ ఆర్థికంగా నిలబడితేనే కుటుంబం తద్వారా సమాజం మహిళ చేత ప్రభావితం అవుతాయని , స్వామి వివేకానంద జీవితం ఎంతో ఆదర్శవంతమని ఆయన రచనలు సాహిత్యం ఒక వెయ్యి సంవత్సరాల వరకు సమాజానికి ఉపయోగపడతాయని మహిళలు స్వతంత్రంగా నిలబడడానికి ఆ సాహిత్యం కూడా దోహదపడుతుందని అన్నారు . అనంతరం ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు .

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మహిళా సాధికారతే లక్ష్యంగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని , బ్యూటిషన్ , మగ్గం వర్క్ , ఫ్యాషన్ డిజైనింగ్ , కార్ డ్రైవింగ్ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు . కుటుంబ శిక్షణ పొందిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు శ్రీ కేశవలాల్ పటేల్ , చంద్రశేఖర్ , మాధవి , రామిరెడ్డి , గడ్డం అశోక్ , అంకతి పాపారావు , గౌతమి తదితరులు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS