శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినవేడుకలు

Spread the love

*సాక్షిత పెద్దపల్లి నియోజకవర్గం : శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.


ఎమ్మెల్యే కేక్ కట్ చేసి కవితక్క జన్మదిన వేడుకల కార్యక్రమం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ…
కవిత ఉద్యమ నాయకురాలని, తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అని, ఈ బతుకమ్మ పండుగకు దేశ విదేశాల్లో ఒక అంబాసిడర్ గా వ్యవహరించి ఎంతో ప్రాచుర్యం కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి కవిత గారని తెలిపారు.వారి ఉద్యమ నేపథ్యమైతే నేమి, మనబతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో ప్రాచుర్యం కల్పించిన తీరైతే నేమి, వారు తెలంగాణ బిడ్డలకు ఒక ఐకాన్ లా మారారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిపై బీజేపీ నాయకులు అబండాలు వేస్తూ తప్పుడు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ఇటువంటి మాటలు తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ సమాజానికి శోభనీయం కాదన్నారు. కవిత ని కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని,ఇటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాల్వశ్రీరాంపూర్ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి,ఎంపీపీ నూనేటి సంపత్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ లైసెట్టి బిక్షపతి , BRS నాయకులు పైడ రవి కుమార్, పెంచాల శ్రీధర్,సుంకం మల్లారెడ్డి, ఈర్ల శ్రీనివాస్,కూకట్ల నవీన్,వాసు, కళ్యాణ్, మధు, సంపత్, రంగయ్య, తక్దీర్,కరుణాకర్, కన్నం రమేష్, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page