SAKSHITHA NEWS

అతివలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
అన్నింటా ఆడ బిడ్డలకే అగ్ర తాంబులం
శిశువు నుంచి వృద్ధురాలి దాకా సంక్షేమ కార్యక్రమాలు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంట్ లో పోరాటం
మహిళలకు ఎంపీ నామ నాగేశ్వరరావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడ ఆయన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అతివలకు అన్ని విధాలా అండగా ఉంటూ ప్రతి పధకంలోను మహిళలకు అగ్ర తాంబులం ఇస్తూ ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ ఆర్ధిక స్వాలంబన కలిగిస్తున్నదని అన్నారు. విద్య, వైద్యం, ఆర్ధిక, సామాజిక, సంక్షేమం, రాజకీయ తదితర రంగాల్లో మహిళలకు ప్రధమ ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీఆర్ఎస్ ఎంతోకాలంగా పార్లమెంట్ లో పోరాడుతుందని నామ గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, ఒంటరి మహిళల పింఛన్, వితంతు పింఛన్, బీడీ కార్మికుల పింఛన్, ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి, న్యూట్రేషన్ కిట్లు,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారని అన్నారు.

శిశువు నుంచి వృద్ధురాలి దాకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్నింటా ఆడ బిడ్డలకే అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో దాదాపు రూ.1300 కోట్ల మేర పంపిణీకి చర్యలు తీసుకున్నారని అన్నారు.నేడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా అన్ని అంశాల్లో తెలంగాణ మహిళలు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు మరింత గౌరవం పెరిగిందన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నామ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడ బిడ్డలకు కానుకగా వడ్డీ లేని రుణాలను అందజేస్తుందన్నారు. ఇందుకోసం రూ.750 కోట్లను విడుదల చేయడం సీఎంకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ పథకం వల్ల 4,31,025 మహిళా సంఘాలకు సంబంధించి 46,10,504 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలు, మహిళా సంఘాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే తాజాగా “ఆరోగ్య మహిళ ” అనే సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈనెల 8న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. ఏడాదిలో 4 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ఏప్రిల్ నుంచి పంపిణీ చేయనున్నారని చెప్పారు. ఏ పథకమైనా మహిళల పేరిటనే ప్రభుత్వం అందిస్తున్నదని నామ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS