SAKSHITHA NEWS

సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు మరియు కాలనీ వాసులతో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS