Estimated cost of Rs 1.80 Crores in Samata Nagar Colony under Hyder Nagar Division
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ లో రూ .1.80 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే రాక్ గార్డెన్ పార్క్ నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, మంత్రి KTR సహకారం తో, ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ లో నే ప్రత్యేకంగా రాక్ గార్డెన్ పార్క్ పనులు మొదలుపెట్టాము అని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని, అదే విధంగా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్య మంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో, ప్రభుత్వ విప్ గాంధీ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదితామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ రాజీవ్, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, సమత నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.