KCR effigy burnt as proof of attack on Pawan Kumar’s garden
తోట పవన్ కుమార్ పై దాడి నిదర్శనగా కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుల ఆగ్రహం
సాక్షిత సికింద్రాబాద్, : వరంగల్ లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ కుమార్ పై బిఆర్ఎస్ పార్టీ గుండాలు జరిపిన దాడి హేయమైన చర్య తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్,(బబ్బర్) ఆగ్రహం వ్యక్తం చేశారు . బిఆర్ఎస్ నాయకుల దాడికి నిరసనగా సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపించారు.తీవ్ర గాయాలపాలై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ త్వరగాకోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను అధికార పార్టీకి చెందిన కొంతమంది గూండాలు యదేచ్చగా దాడులకు దిగుతున్నప్పటికీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ స్పందించకపోవడం అన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరుచుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే సరైన సమాధానం చెప్తుందని హెచ్చరించారు.తెలంగాణలో శాంతిభద్రతలు కరువయ్యాయని పూర్తిగా రౌడీ రాజ్యం నడుస్తుందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ ఐత.చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు జి.లక్ష్మణరావు, సి.పి శంకర్,అడ్వకేట్ వేద్.ప్రకాష్ యాదవ్, సనత్నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ జి.ఎల్.రమేష్ బాబు,సనత్ నగర్ ఎస్సీ సెల్ కన్వీనర్ కె.ఎల్ శ్రవణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.మల్లేష్ యాదవ్,ఆశిష్ తదితరులు ఉన్నారు.