చిన్న మధ్య తరగతి పత్రిక జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇవ్వాలి

Spread the love

చిన్న మధ్య తరగతి పత్రిక జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇవ్వాలి

  • ఐక్య వేదిక నాయకులు డిమాండ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్ట్ లకు అందరితో పాటు సిఎం హామి మేరకు చిన్న మధ్య తరగతి పత్రికలలో పనిచేసే జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక జిల్లా చైర్మన్ డా. కె.వి. కృష్ణారావు, కన్వీనర్ గుంతేటి వీరభద్రయ్య లు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఖమ్మంలో మాట్లాడుతూ నాడు తెలంగాణను వ్యతిరేఖించిన ఆంద్రా, కార్పోరేట్ మీడియాకు ప్రాధాన్యత నిచ్చి తెలంగాణ ఉధ్యమం కోసం కృషి చేసిన చిన్న మధ్య తరగతి పత్రికల జర్నలిస్ట్ లను విస్మరిస్తే సహించేది లేదన్నారు. కొన్ని వర్గాల జర్నలిస్ట్ లకే పేద్ద పీట వేయాలని చూస్తే ఊరుకొబోమన్నారు. చిన్న మధ్య తరగతి పత్రికలలో అత్యదికులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉన్నారని వారంతా బిపిఎల్ కెటగిరి కి చెందినవారని మొదటి దపాలోనే వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని లేకుంటే దీక్షలకు సిద్దమన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ బానోతు భద్రునాయక్, అబ్దుల్ రెహమాన్, పెరుగు వెంకటరమణ యాదవ్, మాల మహానాడు దాసరి శ్రీను, ఐక్యవేదిక నాయకులు రవిచంద్ర చౌహన్, జంగిపల్లి రవి, నకిరికంటి సురేష్, ఉపేంద్ర నాయక్, రమ్య, రవీంద్ర నాయక్, మురళి, గోపి, మస్తాన్, ఎస్.కె భాషా, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page