సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గం ఆదర్శనీయం

SAKSHITHA NEWS

The path shown by Sant Sewalal Maharaj for the welfare of society is exemplary

సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గం ఆదర్శనీయం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

దేవరయంజాల్ సేవాలాల్ మల్లన్న తండాలో జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

దేవరయంజాల్ సేవాలాల్ మల్లన్న తండాలో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చూపించిన మార్గం ఆదర్శనీయం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారాలకు సరైన గుర్తింపు లభించిందన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంజారాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూల్ సింగ్ నాయక్, నాను నాయక్, రవి నాయక్, సక్రు నాయక్, సైదులు నాయక్, ఆంజనేయులు మరియు డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బంజారా సమాజ్ వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page