SAKSHITHA NEWS

The great inspiration was Pradhata Sant Sri Sewalal Maharaj

గొప్ప స్ఫూర్తి ప్రధాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్
సాక్షిత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

తెల్లాపూర్ లో 57 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బంజారా భవన్ ప్రారంభం
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని పురస్కరించుకొని..

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో గల సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 57 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన బంజారా భవన్ ను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనలు ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS