SAKSHITHA NEWS

The saffron flag is flying on Manthani Gadda BJP leaders

మంథని గడ్డ పైన ఎగిరేది కాషాయ జెండానే…: బీజేపీ నాయకులు..

సాక్షిత న్యూస్, మంథని:

మంథని నియోజక వర్గం మహాదేవ్ పూర్ మండలం లోని ఉట్లపల్లి పోచమ్మ ఆలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదివారం నుండి చేపట్టిన మంథని ప్రజా చైతన్య యాత్ర, మంథని ప్రజా గోస బీజేపీ భరోసా, గడప గడపకి సునీల్ రెడ్డి యాత్ర ని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి ఉట్లపల్లి పోచమ్మ తల్లి దగ్గర ప్రత్యేక పూజలు చేసి అనంతరం యాత్ర ను ప్రారంభం చేశారు.

యాత్ర కు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు , అభిమానులతో కలిసి మహాదేవపూర్ మండలం లోని అన్నారం గ్రామం లోని విధులలో పాదయాత్ర చేసి అన్నారం లో జెండా ఆవిష్కరణ చేశారు.

యాత్రను ఉదేశించి…
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతు…
సునీల్ రెడ్డి ఇంత గొప్ప యాత్ర చేపట్టడాన్ని అభినందిస్తున్నానని,
కాలేశ్వరం, అన్నారం ప్రాజెక్టుల వల్ల అన్నారం గ్రామస్తులు ప్రతి సంవత్సరం పంటలు పూర్తిగా నష్టపోతున్నారు , కెసిఆర్ ప్రభుత్వం ఈ కాలేశ్వరం ప్రాజెక్టుపై వేలకోట్ల అవినీతి చేసింది. మెగా కృష్ణారెడ్డి వంటి వాళ్లకు ప్రాజెక్టులను అప్పగించి ఈరోజు ప్రపంచంలోనే ధనికుడ్ని చేసింది, కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల ప్రాజెక్టు, ప్రతి సంవత్సరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోతున్న రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోవడం, బాధాకరం ప్రజలలో చైతన్యం నింపడానికి ఇటువంటి యాత్రలు ఇంతగనో అవసరమన్నారు. ఈ మంథని నియోజక వర్గ ప్రాంతాన్ని అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఈ కాలేశ్వరం నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా ముంపుకు గురై పంటలు వేసుకోలేని స్థితిలో ఉన్నారని, రైతాంగం చాలా ఇబ్బందుల గురవుతున్నారని, అలాగే ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ…
నా ఈ ప్రజా చైతన్య యాత్ర అన్నారం గ్రామంలో చేయడానికి ఈ కారణం కాలేశ్వరం ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టు, వల్ల ఎక్కువగా నష్టపోయేది ఈ గ్రామస్తులేనని, ఇక్కడ నుండే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్రను ప్రారంభించడం జరిగిందని స్పష్టం చేశారు. కెసిఆర్ అవినీతి, కుటుంబ పాలనను ఈ రాష్ట్రం నుండి తరిమేయడానికి బిజెపి పార్టీ కంకణం కట్టుకుందని, రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా, మార్చివేసిందని, కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే గ్రామాలు దినదినం అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాలలో స్మశాన వాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దొంగలాగా రాత్రికి రాత్రే మళ్లించిన ప్రభుత్వం కేసీఆర్ దని, కెసిఆర్ గొప్పగా కాలేశ్వరం గురించి చెప్పి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరిగిందని, బ్యాక్ వాటర్ తో పొలాలు మునిగి ఇక్కడ రైతాంగం గోస పడుతున్నారని, అన్నారం లో కరెంటు వ్యవస్థ సరిగా లేదని, డబుల్ బెడ్ రూమ్ లు లేవని, రైతు రుణమాఫీ లేదని, ఇలా అనేక సమస్యలు ఇక్కడి అన్నారం ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారని అన్నారు. భవిష్యత్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నారం ప్రాంతంలో ఒక ప్రాథమిక వైద్యశాల, కరెంటు సబ్స్టేషన్ అలాగే కాళేశ్వరం నుండి అన్నారం వరకు బస్సు సౌకర్యము, కాలేశ్వరం నుండి అన్నారంకు మధ్యలో వంతెన నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదిశ్వర్, యాత్ర ప్రముఖ్ వెన్నంపల్లి పాపయ్య, పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రావుల రామ్ నాథ్, జిల్లా మంథని నియోజకవర్గ ప్రభారీ అనిల్ రెడ్డి, మహాదేవ్ పూర్ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, యాత్ర సహా ప్రముఖ్ లు దుర్గం తిరుపతి, వివిధ మండలల అధ్యక్షులు మల్కా మోహన్ రావు, పిలుమారి సంపత్, బొమ్మన భాస్కర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్ కుమార్, చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయరెడ్డి, మండల అధ్యక్షులు జంగంపల్లి అజయ్, మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, మంథని రాజేందర్, పూసల రాజేంద్రప్రసాద్, గంట అంకయ్య, పసుల శివ, మేడిపల్లి పూర్ణ చందర్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, ఆకుల శ్రీధర్, జిల్లా నాయకులు పోతారవేణి క్రాంతి, బోగోజ్ శ్రీనివాస్, మాచగిరి రాము, నాంపల్లి రమేష్, వీరబోయిన రాజేందర్, చిలువేరు సతీష్, రవి యాదవ్, సంతోష్, బీమవరపు సంపత్, బీజేవైఎం జిల్లా ఉప అధ్యక్షులు కరెంగుల రామకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షులు రామ్ శెట్టి మనోజ్, ముద్ర కోళ్ల సుధాకర్, అజ్మీరా నవీన్, గొర్రె శ్రీకాంత్, లంగారి ఉపేందర్, నూకల మహేందర్, జయకర్, లింగంపల్లి జోగేష్, సోనారి శ్యామ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS