Successful Gopalamitra veterinary camp at Nereda village
నేరేడ గ్రామంలో విజయవంతమైన గోపాలమిత్ర పశు వైద్య శిబిరం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకానీ మండల పరిధిలో నేరడ గ్రామంలో జిల్లా పశు గణ సంస్థ వైరా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాలమిత్ర పశు వైద్య శిబిరం విజయవంతమైనదని డాక్టర్ రాగిణి ఒక ప్రకటనలో తెలియజేశారు. నేరేడు గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ ప్రారంభించారు.
ఈశ్వరమ్మ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో 45 పశువులకు గర్భకోశ వ్యాధులకు పరీక్షలు వ్యాధి నిర్ధారణ చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎల్ డీ ఏ డైరెక్టర్ షేక్ అఫ్జల్, గోపాలమిత్ర సూపర్వైజర్ జ్ శంకరయ్య, ఎం వెంకటేశ్వరరావు, గోపాల మిత్రులు రామచందర్, నగేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.