Telangana state government that does not care about BCs
బీసీలను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్…
మంథని నియోజక వర్గం సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం బీసీల సమస్యలపై బిజెపి నాయకులు పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ… బీసీల సంక్షేమాన్ని మరిచిన టిఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు రాష్ట్రం ఏర్పడిన నుండి ఎలాంటి సంక్షేమ ఫలాలు బీసీ స్కీములు గాని, బీసీ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఉపకార వేతనాలు లేక బిసీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని, నిరుద్యోగ యువతకు బాధాకరం రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం బీసీలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తాం అన్నారు.
దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పి మోసం చేసిన ఘనత కేసిఆర్ కె దక్కిందని ఉన్న దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని చట్టసభల్లో బీసీలకు తగినంత రిజర్వేషన్ కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్, మండల యువ నాయకులు యాట భూమేష్, తొట్ల రాజు, తీగల శ్రీధర్, కుంట, చక్రి, తదితరులు పాలుగోన్నారు.