SAKSHITHA NEWS

MLA contribution to Gowda Kalyana Mandap and Dormitory at Vemulawada

వేములవాడలో గౌడ కళ్యాణ మండపం, వసతి గృహంకు ఎమ్మెల్యే సహకారం…

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.25 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం వద్ద నిర్మిస్తున్న గౌడ కళ్యాణ మండపం మరియు వసతి గృహంకు సహకారం అందిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే తన తల్లిదండ్రులు స్వర్గీయ కేఎం పాండు శ్యామల జ్ఞాపకార్థం రూ.25 లక్షల విరాళంను ప్రకటించి తన నివాసం వద్ద కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ , ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ , మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్ కి రశీదు అందజేశారు.


SAKSHITHA NEWS