SAKSHITHA NEWS

Arrest of wildlife gang members

image 26

వన్యప్రాణుల ముఠా సభ్యుల అరెస్టు
వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే ముఠా గుట్టును కాశీబుగ్గ అటవీ శాఖాధికారులు రట్టు చేశారు.

యాంకర్ : శ్రీకాకుళం జిల్లా పలాస లో వన్యప్రాణుల స్మగ్లింగ్ కు పాల్పడిన నలుగురు స్మగ్లర్ల ముఠా సభ్యులను కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.మందస మండలం బొందికారికి చెందిన సవర కోదండ,మెళియాపుట్టి మండలం మొజ్జాడపేటకు చెందిన సనపలరుషి అనే ఇద్దరు యువకులు మందస లోని మహేంద్రగిరి అడవుల్లో రెండు అలుగులను వేటాడి పట్టుకున్నారు.పలాసలోని మరో ఇద్దరు యువకులు ఎలమలసాయి,బమ్మిడి రవితేజల
సహాయంతో పలాస లోని సూర్య రాజ్ ఇన్ లాడ్జిలో సాక్షాత్తు అటవీశాఖ అధికారికే అమ్మకానికి పెట్టారు. అటవీ శాఖ అధికారితో రూ.25 లక్షలకు బేరం కుదుర్చుకుని రెండు అలుగులు అప్పగించారు. కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ ఏ.మురళీకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది చాక చక్యంగా పట్టుకున్నారు.నలుగురు స్మగ్లర్లలతో పాటు రెండు అలుగులను స్వాధీనం చేసి కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.నిందితులపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టంకింద అరెస్టు చేసి నట్లు కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ ఏ.మురళీ కృష్ణమ నాయుడు వెల్లడించారు.
బైట్…
ఏ.మురళీ కృష్ణమ నాయుడు,
ఎఫ్ ఆర్ వో,కాశీబుగ్గ


SAKSHITHA NEWS